ఈనెల 14న భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి రావాలని గవర్నర్ నరసింహన్‌కు ఆలయ అర్చకులు ఆహ్వానం పలికారు. ఈవో తాళ్లూరి రమేశ్‌బాబు ఆధ్వర్యంలో ముఖ్య అర్చకుడు మురళీకృష్ణమాచార్యులు, వేద పండితులు ఆహ్వాన పత్రం అందజేశారు. ఉగాది సందర్భంగా రాజ్‌భవన్‌లో ప్రత్యేక పూజలు చేసి నరసింహన్ దంపతులకు వేద ఆశీర్వచనాలు అందించారు. సీతారాముల కల్యాణ విశేషాలు పొందుపరిచిన రాజ పత్రాన్ని చదివి వినిపించారు. 15న శ్రీ రామ పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.
సీఎంకు సమాచారం