మే డే సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. బలమైన భారత్‌ను నిర్మించటంలో చెమటోడుస్తోన్న కార్మికుల కీలక పాత్రను గుర్తించి సంతోషించాల్సిన సందర్భం ఇదని అన్నారు. అందరం కార్మికుల కృషిని గౌరవిద్దామని పిలుపునిచ్చారు. కార్మికులందరి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మే డేను పురస్కరించుకొని కొవిడ్ దృష్ట్యా ప్రభుత్వం ఇచ్చిన సూచనలను పాటిస్తామని ప్రతిన బూనాలన్నారు.
కార్మికులకు గవర్నర్ తమిళిసై మేడే శుభాకాంక్షలు - ప్రపంచ కార్మిక దినోత్సవం
మే డే సందర్భంగా కార్మికులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం ఇచ్చిన సూచనలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయాలని అన్నారు.
కార్మికులకు గవర్నర్ తమిళిసై మేడే శుభాకాంక్షలు