హైదరాబాద్ గచ్చిబౌలి మైదానం వేదికగా సాగుతున్న ప్రోకబడ్డీ సీజన్ 7ను గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. మెుత్తం టోర్నీలో 12జట్లు బరిలో ఉన్నాయి. 92 రోజుల పాటు 137 మ్యాచులు జరగనున్నాయి. హైదరాబాద్‌లో ఈనెల 26వ తేదీ వరకు మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్‌లోనే తెలుగు టైటాన్స్ ఓటమి పాలైంది. ఆట మెుదలైన నుంచి పెద్దగా ప్రభావం చూపని ఆటగాళ్లు.... చివరి నిమిషంలో కాస్త పోరాడినా ఫలితం లేకపోయింది. 6 పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్‌పై యూముంబ విజయం సాధించింది.
'ప్రోకబడ్డీ సీజన్ 7ను ప్రారంభించిన గవర్నర్' - pkl
గచ్చిబౌలి మైదానంలో ప్రోకబడ్డీ ఏడో సీజన్‌ను గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు. తొలి మ్యాచ్‌లో యూమూంబ తెలుగు టైటాన్స్‌పై 6 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.
'ప్రోకబడ్డీ సీజన్ 7ను ప్రారంభించిన గవర్నర్'