గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తండ్రి అనంతన్ గాంధీ ఆసుపత్రికి వచ్చారు. చెవి సమస్యతో బాధపడుతున్న ఆయనకు... గాంధీ వైద్యులు ఈఎన్టీ నిపుణులు శోభన్ బాబు చికిత్స చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గవర్నర్ తండ్రి - governor Father came to the gandhi hospital in hyderabad
గవర్నర్ తమిళిసై తండ్రి అనంతన్... సామాన్యుడిలా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చారు. చెవి సమస్యతో బాధపడుతున్న ఆయన గాంధీ ఆసుపత్రికి రావడం ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన గవర్నర్ తండ్రి
అనంతన్ వయసు 86 సంవత్సరాలు కాగా... సమస్యతో వచ్చిన ఆయనకు వైద్య బృందం చికిత్స అందించారు. గవర్నర్ తండ్రి అయినప్పటికీ సామాన్య వ్యక్తిగా ప్రభుత్వ ఆసుపత్రికి రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇవీ చూడండి: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు