తెలంగాణ

telangana

By

Published : Nov 15, 2019, 10:04 AM IST

ETV Bharat / state

కొలకనూరి ఇనాక్‌ సాహితీ సప్తాహంలో గవర్నర్ దత్తాత్రేయ

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి జరగాలంటే సంఘర్షణతో మాత్రం సాధ్యం కాదని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గాన సభలో కొలకనూరి ఇనాక్‌ సాహితీ సప్తాహం ముగింపు కార్యక్రమానికి గవర్నర్ దత్తాత్రేయ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

కొలకనూరి ఇనాక్‌ సాహితీ సప్తాహంలో గవర్నర్ దత్తాత్రేయ

కొలకనూరి ఇనాక్‌ సాహితీ సప్తాహంలో గవర్నర్ దత్తాత్రేయ

హైదరాబాద్ చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గాన సభలో ప్రొఫెసర్ కొలకనూరి ఇనాక్‌ సాహితీ సప్తాహం ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రతి దినం నూతన గ్రంథావిష్కరణ ఏడు రోజుల ముగింపు కార్యక్రమంలో ఆచార్య కొలకలూరి ఇనాక్ రాసిన "చలన సూత్రం" కథానికా సంపుటుల సంకలనం పుస్తకాన్ని గవర్నర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

అనంతరం ఘనంగా సన్మానించి స్వర్ణకంకణం తొడిగారు. సమ సమాజ నిర్మాణం కోసం ఒక మానవతావాదిగా ఆచార్య ఇనాక్‌ చేసిన రచనలు ఎంతో ఆదరణ చూరగొన్నాయని గవర్నర్ దత్తాత్రేయ తెలిపారు. అప్పట్లో తన జీవిత చరిత్ర రాయాలంటే భయంగా ఉండేదని ఇప్పుడు పూర్తి ధైర్యం వచ్చిందని ఆచార్య ఇనాక్‌ పేర్కొన్నారు. బీసీ కమిషన్ సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్ రావు, శ్రీత్యాగరాయ గాన సభ అధ్యక్షుడు వీఎస్‌ జనార్థన్‌ మూర్తి, ప్రముఖ సాహితీవేత్త విహారి, సాహితీవేత్తలు, సాహితీ ప్రియులు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి : ఆ ఒక్కటి పక్కనబెడతాం.. మిగతావి పరిష్కరించండి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details