మహిళలు లైన్ ఉమెన్‌గా రాణించేందుకు నాంది పలికిన బబ్బూరి శిరీష (20) మహిళాలోకానికి గర్వకారణంగా నిలిచిందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మొదటి లైన్ ఉమెన్‌గా విధులు నిర్వహిస్తోన్న శిరీషకు గవర్నర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
మెుదటి లైన్ ఉమెన్‌కు గవర్నర్ అభినందనలు
తెలంగాణలో మెుట్టమెుదటి లైన్ ఉమెన్‌గా నిలిచిన బబ్బూరి శిరీషకు గవర్నర్ తమిళిసై అభినందనలు తెలిపారు. ఈ మేరకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
మెుదటి లైన్ ఉమెన్‌కు గవర్నర్ అభినందనలు
ఇటీవల టీఎస్ఎన్పీడీసీఎల్ నిర్వహించిన పరీక్షల్లో శిరీష విజయం సాధించింది. రాష్ట్రంలో మొట్టమొదటి లైన్ ఉమెన్‌గా నిలిచి చరిత్రకెక్కింది.
ఇదీ చదవండి :నర్సాపూర్‌ను ప్లాస్టిక్ రహితంగా మార్చుతాం : పురపాలక కమిషనర్