Governor On Mahila Darbar: మహిళల కోసం ప్రత్యేక దర్బార్ కార్యక్రమం చేపట్టనున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వెల్లడించారు. ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు రాజ్‌భవన్‌లో మహిళా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రజాదర్బార్‌లో భాగంగా మహిళల సమస్యలను గవర్నర్ తమిళిసై విననున్నారు. ప్రస్తుతం సమాజంలో మహిళల సమస్యలు, వారి అభిప్రాయాలను ఈ కార్యక్రమంలో పంచుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు 040-23310521 నెంబర్‌కి ఫోన్ చేయాలని సూచించారు. అలాగే రాజ్‌భవన్ అధికారిక మెయిల్ ఐడీ rajbhavan-hyd@gov.in కు మెయిల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలని కోరారు.
Governor On Mahila Darbar: 'మహిళల సమస్యలు వినేందుకు ప్రత్యేక దర్బార్'
Governor On Mahila Darbar: ప్రజా దర్బార్‌లో భాగంగా మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై ప్రకటించారు. ఈనెల పదో తేదీన వారి సమస్యలు వినేందుకు మహిళా దర్బార్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
గవర్నర్ తమిళిసై