Governor Condemned Attack On Arvind House: హైదరాబాద్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడిని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖండించారు. ఈ దాడి ఘటనపై నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని తమిళిసై వ్యాఖ్యానించారు. కుటుంబసభ్యులు, పనివాళ్లను భయభ్రాంతులకు గురి చేయడం.. ఆస్తులను ధ్వంసం చేయడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని తమిళిసై సౌందర రాజన్ ట్వీట్ చేశారు.
అసలేం జరిగిందంటే:భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై తెరాస కార్యకర్తలు ఉదయం దాడి చేశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసాన్ని ముట్టడించి ఇంటిలోని అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఎంపీ ఇంటి ముట్టడికి వెళ్లిన తెరాస కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఇటీవల ధర్మపురి అర్వింద్ మాట్లాడుతూ కవిత పార్టీ మారతారని చెప్పడంతో పాటు ఆయన మరికొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెరాస కార్యకర్తలు ఆరోపించారు.