Governor Tamilisai Raised Questions on RTC bill : తెలంగాణ రోడ్డు రవాణా సంస్థకి చెందిన కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన బిల్లుపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లేవనెత్తిన అంశాలపై.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరణ ఇచ్చినా.. మరికొన్ని సందేహాలపై.. వివరణ ఇవ్వాలంటూగవర్నర్ తమిళిసై అడిగారు. ఆర్టీసీలో భారత ప్రభుత్వ వాటా 30 శాతం ఉన్నందున కేంద్రం సమ్మతి పొందారా లేదా అన్న విషయమై వివరణ కోరిన గవర్నర్.. సమ్మతి పొందినట్లైతే ప్రతిని ఇవ్వాలని లేదంటే చట్టబద్ధత పాటించేలా తీసుకున్న చర్యలను తెలపాలని పేర్కొన్నారు.
RTC Bill is pending with Governor : సంస్థలోని శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల సంఖ్యను కేటగిరీలు, డిపోల వారీగా మొత్తం సంఖ్యను అందించాలన్న తమిళిసై.. కాంట్రాక్ట్, క్యాజువల్, ఇతర ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య కూడా కావాలని అన్నారు. తాత్కాలిక ఉద్యోగుల కోసం తీసుకునే చర్యల వివరాలు కూడా అడిగారు. భూములు, భవనాలు తదితర ఆర్టీసీ స్థిర, చరాస్థులు కార్పోరేషన్‌లోనే కొనసాగుతాయా..? లేదా వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా అని గవర్నర్ ప్రశ్నించారు. బస్సులను నడిపే బాధ్యత ఎవరిదని..? ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత వారి నిర్వహణ బాధ్యత ఎవరిదన్నారు. ఉద్యోగులు, రోజువారీ ప్రయాణీకుల ప్రయోజనాల పరిరక్షణలో కార్పొరేషన్ పాత్ర గురించి వివరాలు కోరారు. ఆర్టీసీ ఉద్యోగులు... ప్రభుత్వ సర్వీసులో చేరిన తర్వాత వారు సంస్థలో డిప్యుటేషన్‌పై పని చేస్తారా..? లేదా ఇతర ఏర్పాట్లు చేస్తారా..? అని గవర్నర్ వివరణ కోరారు.
KTR Challenge to Telangana Congress Leaders : 'ఓఆర్ఆర్ అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా'
TS Govt Clarifications on RTC Bill : ఈ అంశాలపై వీలైనంతర త్వరగా స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన గవర్నర్ తమిళిసై.. బిల్లుపై నిర్ణయం తీసుకునేందుకు ఈ వివరణలు ఉపయోగపడతాయన్నారు. గవర్నర్ రెండో మారు కోరిన వివరణలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంపింది. రాజ్‌భవన్ నుంచి దస్త్రం వచ్చిన కొద్ది సమయానికే అన్ని వివరణలను పంపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.