తెలంగాణ

telangana

ETV Bharat / state

Governor Approves TSRTC Merger Bill : రైట్ రైట్.. తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం.. బిల్లుకు గవర్నర్‌ ఆమోదం - టీఎస్​ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం

TSRTC Merger Bill
Governor Approves TSRTC Merger Bill

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2023, 11:36 AM IST

Updated : Sep 14, 2023, 9:35 PM IST

11:31 September 14

టీఎస్​ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్‌ తమిళిసై ఆమోదం

Governor Approves TSRTC Merger Bill : ఎట్టకేలకు తెలంగాణ ఆర్టీసీ విలీన బిల్లు(TSRTC Merger Bill)కు మోక్షం లభించింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai) తాజాగా ఆర్టీసీ విలీన బిల్లుకు ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 సిపారసుల విషయంలో ప్రభుత్వ స్పందనపై సంతృప్తి చెందానని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం తన సిఫారసులకు సంతృప్తకరమైన సమాధానం ఇచ్చినందుకు ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్‌ తమిళిసై అభినందనలు తెలిపారు.

Telangana RTC Merger Bill Approved : ప్రజా రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీలోని 43,373 మంది సిబ్బంది సంక్షేమమే లక్ష్యంగా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. ఇటీవల మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆ బిల్లును గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ అనుమతి కోసం పంపారు. అది సాంకేతికంగా ఆర్థిక బిల్లు కావడంతో రాజ్​భవన్​ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అలా పంపిన బిల్లును గవర్నర్​ అప్పటికప్పుడే ఆమోదించలేదు.

Excitement over TSRTC Bill : ఆమోదిస్తారా..? ఆపుతారా..? ఆర్టీసీ బిల్లుపై ఎడతెగని ఉత్కంఠ

Telangana RTC Merging in Government : ​ ఆర్టీసీ విలీన బిల్లులోని కొన్ని అంశాలపై గవర్నర్ అభ్యంతరం తెలిపారు. ఆర్టీసీ విభజన, కార్మికుల జీతభత్యాలు, ఉద్యోగ భద్రత, పింఛన్లు వంటి ఐదు ప్రధాన అంశాలపై తమిళిసై సందేహాలు లేవనెత్తారు. వాటికి సమాధానమిస్తూ సీఎస్ శాంతి కుమారి గవర్నర్​కు వివరంగా లేఖ రాశారు. సీఎస్ సమాధానాలతో సంతృప్తి చెందని రాజ్​భవన్​ మరో 6 అంశాలను అదనంగా జోడిస్తూ.. సమాచారం కావాలని కోరారు. అయితే ఈ సారి కేంద్రం వాటా ఆర్టీసీలో 30 శాతం ఉందని పేర్కొనందున విలీనానికి కేంద్రం అనుమతి ఏమైనా తీసుకున్నారా అని.. తీసుకొని ఉంటే సంబంధిత కాపీని పంపాలని చెప్పారు. అలాగే ఆర్టీసీలోని శాశ్వత, తాత్కాలిక ఉద్యోగుల వివరాలను కూడా అడిగారు. ఈ విధంగా అడగడానికి గల కారణం.. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చేయడమే అని రాజ్​భవన్​ వివరణ ఇచ్చింది.

శాశ్వత ఉద్యోగులు మినహా మిగిలిన వారి విషయంలో చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకున్నారని గవర్నర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కార్పొరేషన్​కు సంబంధించిన చర, స్థిరాస్తులు అలాగే కొనసాగుతాయా లేదా చెప్పాలని.. అవి కొనసాగితే ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటుందా అని అడిగారు. ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే వారిని నియంత్రించే అధికారం ఎవరికి ఉంటుందని.. ఉద్యోగులను ప్రభుత్వంలో కలుపుకున్న తర్వాత వీరంతా కార్పొరేషన్​లో డిప్యుటేషన్​పై పని చేస్తారా.. లేక వేరే ఏర్పాటు ఏమైనా ఉందా ఇలా పలు ప్రశ్నలను ప్రభుత్వానికి సంధించారు గవర్నర్. వీటన్నింటికీ రాష్ట్రప్రభుత్వం సరైన వివరణ ఇవ్వడంతో ఆర్టీసీ విలీన బిల్లుపై గవర్నర్ నేడు​ ఆమోదముద్ర వేశారు.

TSRTC Workers Protest at Raj Bhavan : 'గవర్నర్ సానుకూలంగా ఉన్నారు.. బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావంతో ఉన్నాం'

TSRTC merging bill passed in assembly : ఆర్టీసీ బిల్లుకు ఉభయ సభల ఆమోదం... వారంతా ఇక సర్కారీ ఉద్యోగులే

Last Updated : Sep 14, 2023, 9:35 PM IST

ABOUT THE AUTHOR

...view details