Governor Tamilisai Approves TSRTC Bill : టీఎస్ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే బిల్లుపై ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమ్మతించారు. దీంతో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం అయింది. బిల్లుపై తొలుత గవర్నర్ పలు సందేహాలు లేవనెత్తారు. దీంతో సభలో ప్రవేశపెట్టడంపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో రవాణాశాఖ అధికారులతో రాజ్‌భవన్‌లో తమిళిసై సమావేశమయ్యారు. లేవనెత్తిన సందేహాలపై రవాణశాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదివారం గవర్నర్‌కు వివరణ ఇచ్చారు. వారితో సమావేశం అనంతరం బిల్లుకు తమిళిసై ఓకే చెప్పారు. దీంతో పాటు ప్రభుత్వానికి గవర్నర్ 10 అంశాలను సిఫార్సు చేశారు. న్యాయపర అంశాలు, ఉద్యోగుల ప్రయోజనాలను అందులో పేర్కొన్నారు.
Governor Tamilisai on TSRTC Bill : ఈ సందర్భంగా టీఎస్‌ఆర్‌టీసీ ఉద్యోగులందరికీ, వారి కుటుంబాలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వ సేవలో చేరడం వల్ల వారందరికీ ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజ్ భవన్లో దాదాపు గంటన్నర పాటు ట్రాన్స్ పోర్ట్, ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన గవర్నర్.. అనంతరం బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు పచ్చజెండా ఊపారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, ప్రత్యేక కార్యదర్శి విజయేంద్రబోయి, ఆర్టీసీ ఈడీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రాఫ్ట్‌పై గవర్నర్ లేవనెత్తిన సందేహాలకు అధికారులు సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆర్టీసీ విలీనంపై పలు సిఫార్సులు చేస్తూ గవర్నర్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఆమోదించారు.
Governor Asked More Clarifications on TSRTC bill : ఆర్టీసీ బిల్లుపై మరికొన్ని సందేహాలు లేవనెత్తిన గవర్నర్.. సమాధానాలు పంపిన ప్రభుత్వం
బిల్లుతోపాటు 10 అంశాలను సిఫారసు చేసిన గవర్నర్ : ఆర్టీసీ విలీనం తర్వాత ఆస్తులు, ఆర్టీసీ సంపదపై హక్కు పూర్తిగా కార్పొరేషన్‌కే ఉండాలని గవర్నర్ తమిళిసై సిఫారసు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల విభజన పూర్తిగా విభజన చట్టానికి లోబడి జరగాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన తర్వాత... వేతనాలు, బదిలీలు, పదోన్నతులు, పదవీ విరమణ పింఛన్లు, పే స్కేలు, సర్వీస్ నియమాలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగానే ఉండాలని గవర్నర్ పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్టీసీలో ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నవారు వైద్య కారణాలతో ఉద్యోగం చేయలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులకు కారణ్య నియామకం కోరేందుకు అనుమతించాలన్నారు. ఆర్టీసీలో క్రమశిక్షణా చర్యలు కఠినంగా ఉన్నాయన్న గవర్నర్... ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న సర్వీస్ రూల్సే ఆర్టీసీ ఉద్యోగులకు వర్తింపజేయాలని సిఫారసు చేశారు.
ఉద్యోగుల ప్రయోజనాలు సిఫారసు చేసిన గవర్నర్ : ఆర్టీసీ ఉద్యోగులను ఇతర శాఖలకు డిప్యుటేషన్‌పై పంపితే వారి ప్రయోజనాలను సంరక్షించాలని... కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ సర్వీస్ రూల్స్ వర్తింపజేసి వారికి వేతనాలు, ప్రయోజనాలు కల్పించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సిఫారసు చేశారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ సమాన వైద్య సదుపాయలు కల్పించాలన్నగవర్నర్... వారి కుటుంబ సభ్యులకు సైతం వైద్య సదుపాయాలు అందించాలని సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా బస్సుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని గవర్నర్ తమిళిసై సిఫారసు చేశారు.
Governor Tamilisai on TSRTC Bill : ఆర్టీసీ బిల్లుపై చర్చించేందుకు రవాణా శాఖ అధికారులతో గవర్నర్ భేటీ
Five Bills Passed in Telangana Assembly : ఐదు బిల్లులకు ఆమోదం తెలిపిన శాసనసభ
Minister Harish Rao Speech at Council : 'ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో.. హైదరాబాద్ హెల్త్ హబ్‌గా మారింది'