టీఎస్‌ఆర్టీసీ వినూత్నంగా డబుల్ డెక్కర్ బస్సుల (Double Decker Buses in Telangana)ను మళ్లీ ప్రవేశ పెట్టాలని ప్రయాణికుడొకరు పురపాలక, ఐటీ శాఖ మంత్రికి ట్వీట్ చేయడం.. దాన్ని రవాణా శాఖ మంత్రికి పంపడం.. ఆ వెంటనే చర్యలు చేపట్టడం వేగంగా సాగిపోయింది. మంత్రి నుంచి ఆర్టీసీ ఉన్నతాధికారుల వరకూ కసరత్తు చేశారు. టెండర్లు పిలిచారు. 7 నెలలైనా చడీచప్పుడు లేకుండా పోయింది.
ఎందుకీ జాగు..
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కరోనా మహమ్మారి కుదిపేసింది. ఈ నేపథ్యంలో డబుల్ డెక్కర్ బస్సులు (Double Decker Buses in Telangana) ఆర్టీసీకి గుదిబండ కాబోతున్నాయా అనే విషయమై కొంత మంది ఉన్నతాధికారులు చర్చించారు. ఆ బస్సులు (Double Decker Buses in Telangana) నిండుతాయా.. నిండినా ఒనగూరే ప్రయోజనం పెద్దగా ఏమీ లేదనేది కొంతమంది అధికారుల వాదన. ఇవి (Double Decker Buses in Telangana) ఆర్టీసీకి తప్పకుండా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయనేది మరికొందరి ఆలోచన.