ప్రజల్లో చర్చ జరుగుతున్న అంశాలనే గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. దేశంలో మిగిలిన రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని బాలరాజు ప్రతిపాదించారు.
గవర్నర్ ప్రసంగం చూసైనా విమర్శకులు పంథా మార్చుకోవాలి: బాలరాజు - Telangana Legislative Assembly sessions 2021
మూడో రోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ధన్యవాద తీర్మానం ప్రతిపాదించారు.
![గవర్నర్ ప్రసంగం చూసైనా విమర్శకులు పంథా మార్చుకోవాలి: బాలరాజు assembly sessions 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11040731-363-11040731-1615958992687.jpg)
మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు సరఫరా అందించినట్లు గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. మిషన్ భగీరథను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు. మిషన్ భగీరథకు కేంద్ర ప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలంగాణను సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని తెలిపారు. సీఎం కేసీఆర్‌పై కొంతమంది ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ నాయకత్వం దేశానికి ఎంతో అవసరం. గవర్నర్ ప్రసంగం చూసేనా విమర్శకులు పంథా మార్చుకోవాలి. ఎస్సీలకు ప్రత్యేక కార్యక్రమం అమలుచేసే యోచన. దళితజ్యోతి పేరిట అమలు చేసే యోచనలో సీఎం. రిజర్వేషన్లు ఎత్తివేసే ప్రయత్నం జరుగుతోంది. వ్యతిరేకంగా అందరం పోరాడాల్సిన అవసరం ఉంది. భైంసా తరహా ఘటనలు జరిగేలా కొందరు యత్నిస్తున్నారు. రాజకీయ లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. అటువంటి ప్రయత్నాలను ప్రభుత్వం సాగనీయదు. - గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్
- ఇదీ చదవండి :నోములకు సంతాపం తెలిపిన మండలి