Balka on Etela: సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానంటుంటే జనం నవ్వుకుంటున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. హుజురాబాద్‌లో ఓటమి భయంతోనే ఈటల రాజేందర్ ముఖ్యమంత్రిపై పోటీ చేస్తానంటూ కొత్త రాగం ఎత్తుకున్నారని విమర్శించారు.
ఈటల రాజేందర్‌కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఈ కొత్తరాగం. ఊరు, పేరు తెలియని వ్యక్తిని మంత్రిని చేసిన వ్యక్తి కేసీఆర్. బాగా పని చేయమంటే భూముల కబ్జాలకు పాల్పడ్డారు. హుజూరాబాద్‌లో ఆయన ఓడిపోవడం ఖాయం. అందుకే సీఎంపై పోటీ చేస్తా అంటున్నరు. ఇప్పుడు ఆయన ఓ చెల్లని రూపాయి. అందుకే అలా మాట్లాడుతున్నారు.
- బాల్క సుమన్, ప్రభుత్వ విప్