రాష్ట్రంలో ఏడుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. సైబరాబాద్ నేర విభాగం డీసీపీగా రోహిణి ప్రియదర్శిని, నారాయణపేట ఎస్పీగా ఎం.చేతన, మంచిర్యాల ఎస్పీగా రక్షిత కె.మూర్తి నియమితులయ్యారు. ములుగు ఎస్పీగా సంగ్రామ్‌సింగ్ పాటిల్ , భద్రాచలం ఏఎస్పీగా రాజేశ్చంద్ర, ఏటూరునాగారం ఏఎస్పీగా శరత్చంద్ర, మహదేవ్పూర్ ఎస్డీపీఓగా సాయిచైతన్యను నియమిస్తూ సీఎస్ ఆదేశాలిచ్చారు.
మరికొంత మందికి బదిలీ
మరికొంత మంది పోలీసు ఉన్నతాధికారులకు స్థానచలనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నలుగురు ఎస్పీలకు డీఐజీలుగా పదోన్నతి కల్పించినా.. వాళ్లు ఎస్పీల స్థానంలోనే కొనసాగుతున్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 26 మంది డీఎస్పీలను కూడా బదిలీ చేస్తూ సర్కారుఉత్తరులు జారీ చేసింది.
మల్లారెడ్డికి పోస్టింగు ఇవ్వని అధికారులు
జయరాం హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ మల్లారెడ్డికి అధికారులు ఎలాంటి పోస్టింగు ఇవ్వలేదు. ఆయనను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.
ఇవీ చూడండి :'ఆత్మస్థైర్యం తగ్గదు'