రాష్ట్ర ప్రభుత్వం ఉపాద్యాయ, విద్యారంగ సమస్యలపై అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆందోళనకు సిద్ధమవుతోంది. సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలపై పోరాటంలో భాగంగా హైదరాబాద్‌లో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. జనవరి 4న పాఠశాల స్థాయిలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 6న అన్ని మండల కేంద్రాల్లో ధర్నా చేస్తామని తెలిపారు. జనవరి 8న డివిజన్ కేంద్రాల్లో బైక్ ర్యాలీతో వెళ్లి ఆర్డీవోలకు వినతి పత్రం ఇవ్వవనున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ వెల్లడించారు.
'ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌కు ముందే బదిలీలు చేపట్టాలి' - తెలంగాణ వార్తలు
విద్యావ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌కు ముందే బదిలీల ప్రక్రియ చేపట్టి, పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
'ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌కు ముందే బదిలీలు చేపట్టాలి'
జనవరి 11న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పీఆర్సీల హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రాకముందే బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:కళ్లు లేకుంటేనేం... కష్టాలను ఓడించి కలెక్టరయ్యాడు!