భార్యభర్తలిద్దరూ ఒకేచోట పనిచేసేలా వెంటనే బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. భార్యభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైతే.. వారిని ఒకేచోట పనిచేసేలా బదిలీ చేస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ప్రగతి భవన్ ముట్టడించిన టీచర్లు.. అరెస్ట్ చేసిన పోలీసులు - ప్రగతి భవన్
భార్యభర్తలిద్దరూ ఒకేచోట పనిచేసేలా స్పౌస్ కేసుల కింద వెంటనే బదిలీలు చేపట్టాలని.. డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున వచ్చిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి.. గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ప్రగతి భవన్ ముట్టడించిన టీచర్లు.. అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రస్తుత కొవిడ్ నేపథ్యంలో ఇతర ప్రదేశాలకు వెళ్లి పని చేయాలంటే ఇబ్బందికరంగా ఉందని.. ప్రభుత్వ శ్రద్ధ వహించి వెంటనే బదిలీలు చేపట్టి భార్యభర్తలిద్దరూ ఒకేచోట పనిచేసేలా చూడాలని కోరారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారు. తరువాత వారిని గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
- ఇదీ చూడండి:క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడమే ముఖ్యం ఈటల