తెలంగాణ

telangana

ETV Bharat / state

నమ్మించి మోసం చేశాడు... న్యాయం చేయాలని హెచ్చార్సీని ఆశ్రయించిన బాధితుడు - government teacher cheating case in human rights commission

ప్రభుత్వ ఉద్యోగిని నమ్మి ఇంటిని చేతిలో పెడితే మోసం చేశాడని ఓ బాధితుడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించాడు. ప్రభుత్వ ఉద్యోగి స్థానిక పోలీసులతో కుమ్మక్కై తన మోసం చేశారని బాధితుడు ములుగు సురేష్​ కమిషన్​ ఎదుట వాపోయారు. నమ్మించి మోసం చేసిన ప్రభుత్వ ఉద్యోగితో పాటు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన సబ్​ ఇన్​స్పెక్టర్​పై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కమిషన్​ను వేడుకున్నారు.

government teacher cheating case in human rights commission
నమ్మించి మోసం చేశాడు... న్యాయం చేయాలని హెచ్ఛార్సీని ఆశ్రయించిన బాధితుడు

By

Published : Jul 22, 2020, 2:18 PM IST

ఓ ప్రభుత్వ ఉద్యోగిని నమ్మి తన ఇంటిని చేతిలో పెడితే... స్థానిక పోలీసులతో కుమ్మక్కై మోసం చేశారని మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ బాధితుడు రాష్ట్ర మానవహక్కుల కమిషన్​ను ఆశ్రయించాడు. సుచిత్రలోని సాయిబాబా నగర్ కాలనీలో 2011లో వంద గజాల స్థలంలో ఇంటిని నిర్మించుకున్నామని బాధితుడు మలుగు సురేష్ కమిషన్​కు వివరించారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురు కావడం వల్ల తన బావ శ్రీకాంత్ స్నేహితుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడైన సూర్య వద్దకి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఇంటిపై బ్యాంక్ రుణం కోసం 25లక్షల రూపాయలను ప్రభుత్వ ఉద్యోగి పర్సనల్ లోన్ కింద తీసుకున్న అనంతరం... ఇద్దరు సరిసమానంగా నగదును తీసుకున్నట్లు వెల్లడించారు. తాను నెల నెల బ్యాంక్ లోన్ చెల్లించడానికి డబ్బులు ఇస్తున్నప్పటికీ... ఆ ప్రభుత్వ ఉద్యోగి బ్యాంక్ లోన్ చెల్లించలేదన్నారు. దీంతో బ్యాంక్ అధికారులు 2018లో తమ ఇంటి నుంచి తమను కట్టుబట్టలతో వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

తన ఆస్తిని కాజేయడమే కాకుండా స్థానిక పేట్ బషీర్​బాగ్ అడ్మిన్ సబ్​ఇన్​స్పెక్టర్​ మహేష్​తో కుమ్మక్కైన ప్రభుత్వ ఉద్యోగి సూర్య... తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. నమ్మించి మోసం చేసిన ప్రభుత్వ ఉద్యోగి సూర్యతో పాటు... చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన సబ్ ఇన్​స్పెక్టర్​పై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితుడు సురేష్ కమిషన్​ను వేడుకున్నారు. ఈ సంఘటనపై వారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని బాలానగర్ డీసీపీని కమిషన్ ఆదేశించింది.

ఇవీ చూడండి: ట్రాన్స్​ఫార్మర్​లో మంటలు... భయంతో పరుగులు తీసిన ప్రజలు

ABOUT THE AUTHOR

...view details