హైదరాబాద్ నాంపల్లిలో చిన్నారుల అస్వస్థత ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై చర్యలు ప్రారంభించింది. చిన్నారులకు వ్యాక్సిన్ వేసిన ముగ్గురు ఏఎన్జీలతో పాటు ఫార్మాసిస్ట్పై వైద్యశాఖ వేటు వేసింది. నాంపల్లి ఏరియా ఆస్పత్రి హెల్త్ సూపర్వైజర్ను సస్పెండ్ చేసింది. అస్వస్థతకు కారణమైన ట్రమడాల్ మాత్రలను వెనక్కు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ అనంతరం పారాసిటమాల్ సిరప్ మాత్రమే ఇవ్వాలని ఆదేశించింది.
నిర్లక్ష్యంపై ప్రభుత్వం వేటు - నీలోఫర్ ఆస్పత్రి
నాంపల్లిలో చిన్నారుల అస్వస్థత ఘటనపై ప్రభుత్వం స్పందించింది. నిర్లక్ష్యం వహించిన ఏరియా ఆస్పత్రి సిబ్బందిపై వేటు వేసింది.
![నిర్లక్ష్యంపై ప్రభుత్వం వేటు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2643998-925-c4891daa-4bd6-4618-b962-41c383ecb1b2.jpg)
నాంపల్లి ఆస్పత్రి