తెలంగాణ

telangana

ETV Bharat / state

హైకోర్టుకు ఆర్డినెన్స్ సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం - న్యాయవాది చిక్కుడు ప్రభాకర్

రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో విశ్రాంత ఉద్యోగుల ఫించనులో కోత విధించేలా.. ఆర్డినెన్స్ జారీ చేసినట్టు హైకోర్టుకు తెలిపింది. రాష్ట్ర పెన్షనర్ల జేఏసీ అధ్యక్షుడు లక్ష్మయ్యతో పాటు పలువురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.

Lawyer Chikkadu Prabhakar
ఆర్డినెన్స్ హైకోర్టుకు సమర్పించిన ప్రభుత్వం

By

Published : Jun 17, 2020, 6:21 PM IST

అత్యవసర పరిస్థితుల్లో విశ్రాంత ఉద్యోగుల ఫించనులో కోత విధించేలా.. ఆర్డినెన్స్ జారీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్ర పెన్షనర్ల జేఏసీ అధ్యక్షుడు లక్ష్మయ్యతో పాటు పలువురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.

విచారణ 24కి వాయిదా

ఏ చట్టం ప్రకారం ఫించనులో కోత విధించారో తెలపాలని.. ఈ నెల 15న హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్డినెన్స్ తెచ్చినట్టు ఏజీ హైకోర్టుకు నివేదించారు. ఆర్డినెన్స్ వివరాలు పిటీషనర్లకు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. ఆర్డినెన్స్ చట్ట విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదించారు. ఆర్డినెన్స్​ను సవాల్​ చేస్తూ తమ పిటిషన్​ను సవారించేందుకు అనుమతివ్వాలని హైకోర్టును కోరారు. పిటీషన్లపై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న మర్రి రాజశేఖర్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details