తెలంగాణ

telangana

ETV Bharat / state

OILPALM: ఆయిల్​పామ్​ సాగును ప్రోత్సహించే దిశగా సర్కారు అడుగులు - telangana varthalu

రాష్ట్రంలో ఆయిల్‌పామ్ పంట సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉద్పాదకతపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. ఆయిల్‌పామ్ ప్రాజెక్టు పేరిట రాబోయే నాలుగేళ్లల్లో 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ సాగు చేపట్టేందుకు రూపొందించిన ప్రణాళికలు అమల్లో పెట్టింది. సాగు నీటి వనరులు పుష్కలంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వరి, పత్తి వంటి సాంప్రదాయ పైర్లకు ప్రత్యామ్నాయంగా పంట మార్పిడిలో భాగంగా ఆ స్థానంలో ఆయిల్‌పామ్ సాగు చేపట్టేందుకు రైతులకు భారీగా రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది. మార్కెట్‌లో పామాయిల్‌ లాంటి వంటనూనెల డిమాండ్ దృష్ట్యా నికర ఆదాయం ఇచ్చే ఆయిల్‌పామ్ సాగు ఎంతో మేలు అని ఉద్యాన శాఖ భరోసా ఇస్తోంది.

OILPALM: ఆయిల్​పామ్​ సాగును ప్రోత్సహించే దిశగా సర్కారు అడుగులు
OILPALM: ఆయిల్​పామ్​ సాగును ప్రోత్సహించే దిశగా సర్కారు అడుగులు

By

Published : Jul 17, 2021, 6:54 PM IST

రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ పంట సాగు, విస్తీర్ణం పెంపుపై ప్రభుత్వం శరవేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. సాంప్రదాయ పంటల సాగు ద్వారా రైతులు నష్టపోకుండా పంటల మార్పిడి విధానం ప్రోత్సహించే క్రమంలో ప్రధాన ఆహార పంట వరి, పత్తి, మొక్కజొన్నలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తోంది. దీర్ఘకాలిక ఆయిల్‌పామ్‌ ప్రాజెక్టు తెరపైకి తీసుకొచ్చింది. దేశ అవసరాలకు ఏటా 70 వేల కోట్ల పామాయిల్ దిగుమతి చేసుకుంటున్న దృష్ట్యా స్వయం సమృద్ధి సాధించాలంటే 80 లక్షల ఎకరాల్లో ఆయిల్​పామ్​ సాగు చేపట్టాల్సి ఉంది. కానీ, 8 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతోంది. ఇది దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో పెద్దఎత్తున ఆయిల్‌పామ్ సాగు చేయాలని నిర్ణయించింది. నాలుగేళ్లల్లో 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్‌పామ్ సాగులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ఈ పథకం రూపొందించారు.

25జిల్లాల్లో సాగుకు అవకాశాలు

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌ కర్నూలు, సిద్దిపేట, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి తదితర 25 జిల్లాల్లో సాగుకు అవకాశాలు ఉన్నాయని కేంద్రం ధ్రువీకరించడంతో రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది సాగుకు ఉపక్రమించారు. ఎకరాకు 15 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తుంది. 1 టన్ను ఆయిల్‌పామ్ గెలల ధర 19 వేల రూపాయలు పలుకుతుంది. ఎకరాకు 36 వేల రూపాయల రాయితీ ఇవ్వాలని నిర్ణయించిన తరుణంలో రైతాంగం ముందుకు రావాలని ఉద్యాన శాఖ సంచాలకులు లోక వెంకటరామిరెడ్డి సూచించారు.

రైతులకు రుణాలు

దేశంలో 138 కోట్ల జనాభా అవసరాల కోసం ఏటా 22 మిలియన్ టన్నుల నూనె అవసరం ఉన్నప్పటికీ... 7 మిలియన్ టన్నుల నూనె గింజలు ఉత్పత్తి మాత్రమే సామర్థ్యం ఉంది. లోటు భర్తీ చేయడానికి ముడి వంట నూనెలు మలేషియా, ఇండోనేషియా లాంటి చిన్న దేశాల నుంచి దిగుమతి చేయాల్సి వస్తుంది. అందుకోసం పెద్ద ఎత్తున సంపద వెచ్చిస్తున్న నేపథ్యంలో స్వయం సంవృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నువ్వులు, కుసుమ, వేరుశనగ తదితర నూనెగింజల సాగు ప్రోత్సహించాలని నిర్ణయించాయి. తెలంగాణలో పండే ఆయిల్‌పామ్‌ గెలల్లో అధిక నూనె శాతం ఉన్నట్లు పరిశోధనా సంస్థలు తేల్చిచెప్పాయి. ఈ పంట సాగు చేసే రైతాంగానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గుంతల తవ్వకం, సూక్ష్మ సేద్యం కింద కింద బిందు సేద్యం పరికరాలు అవసరమైన రైతులకు సమీప బ్యాంకులను టై అప్ చేసి రుణాలు ఇప్పించే ప్రక్రియ తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంది.

సాగు విధానం చూపించేందుకు పర్యటనలు

ఆయిల్‌పామ్ సాగు చేయాలనుకునే రైతులు వ్యవసాయ శాఖ వద్ద పేర్లు నమోదు చేసుకుంటే ప్రభుత్వమే పంట సాగు విధానం స్వయంగా చూపించేందుకు ప్రభుత్వమే ఖర్చులు భరించి పర్యటనలకు తీసుకువెళ్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆయిల్‌ రికవరీలో తెలంగాణ ఆయిల్‌పామ్‌ అగ్రస్థానంలో నిలిచింది. ఇది ఒక స్థిరీకరణ చెందిన పంట కావడంతో ఆయిల్‌పామ్‌ సాగుకు రైతుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు ఉద్యాన శాఖ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు

అటవీశాఖ, అటవీ అభివృద్ధి సంస్థ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సహకారంతో మొక్కల నర్సరీలు పెంచాలని మంత్రివర్గం సూచించింది. ఈ సాగు విధానంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన అధ్యయన బృందం కోస్టారికా, మలేషియా, థాయ్‌లాండ్‌, ఇండోనేషియాలో పర్యటించనుంది. ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు టీ ఐడియా, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిబంధనల ప్రకారం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్ సూచించింది.

OILPALM: ఆయిల్​పామ్​ సాగును ప్రోత్సహించే దిశగా సర్కారు అడుగులు

ఇదీ చదవండి: OIL PALM: '20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుకు ప్రణాళికలు'

ABOUT THE AUTHOR

...view details