నిరంతరం కష్టపడి పనిచేస్తోన్న వైద్య సిబ్బందిపై... కరోనా వల్ల చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులు దాడి చేయడం సరైంది కాదని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అన్నారు. గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వైద్యులపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్సీ రాంచందర్‌రావు - గాంధీ ఆసుపత్రి వైద్యులపై దాడి
గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. డాక్టర్లపై దాడిని ఆయన ఖండించారు.

MLC Ram Chandar Rao
ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతాయన్నారు. మర్కజ్‌కు తెలంగాణ నుంచి వెయ్యి మందికి పైగా వెళ్లి వచ్చారని వారంతా స్వచ్ఛందంగా ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుని క్వారంటైన్‌లో చేరాలని విజ్ఞప్తి చేశారు.
వైద్యులపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్సీ రాంచందర్‌రావు
ఇదీ చూడండి :అంబులెన్స్‌ను అడ్డుకున్నారు