పాఠశాల విద్యలో జరిగే అక్రమాలను అరికట్టాలని కోరుతూ... ఏబీవీపీ నాయకులు లక్డీకాపుల్లోని పాఠశాల కమిషనరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కరోనా కష్టకాలంలోనూ ఆన్లైన్ క్లాసుల పేరిట ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలల్లో జరుగుతోన్న ఫీజుల దోపిడీని నియంత్రించాలని, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేస్తోన్న పాఠశాలల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
ప్రైవేటు పాఠశాలలపై ప్రభుత్వ నియంత్రణ అవసరం : ఏబీవీపీ - ABVP leaders latest news in Hyderabad
పాఠశాల విద్యలో జరిగే అక్రమాలను అరికట్టాలంటూ... అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు లక్టీకాపుల్లోని పాఠశాల కమిషనరేట్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. కరోనా మహమ్మారి విపత్కర పరిస్థితుల కారణంగా... పాఠశాల విద్యలో ఫీజులు, అడ్మిషన్లు, బోధనపై ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించాలని కోరారు.

ప్రైవేటు పాఠశాలలపై ప్రభుత్వ నియంత్రణ అవసరం : ఏబీవీపీ
కరోనా మహమ్మారి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పాఠశాల విద్యలో ఫీజులు, అడ్మిషన్లు, బోధనపై ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించాలని... ఈ విపత్కర సమయంలో ఉపాధ్యాయులను తొలిగించిన ప్రైవేటు, కార్పోరేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి :'భారత సైన్యానికి మద్దతుగా చైనా యాప్స్ తొలిగించండి'