తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులివ్వాలి: కోదండరెడ్డి - Lock Down Effect Formers problems

తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం గుర్తింపుకార్డులు ఇవ్వాలని ఏఐసీసీ, టీపీసీసీ కిసాన్‌ కాంగ్రెస్‌ నేతలు విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్‌ వల్ల చిన్న, సన్నకారులు రైతులు భారీగా నష్టపోయారని వారు పేర్కొన్నారు.

'రైతులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులివ్వాలి'
'రైతులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులివ్వాలి'

By

Published : Apr 2, 2020, 5:29 PM IST

కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు అమ్ముకునే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులివ్వాలని... ఏఐసీసీ కిసాన్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రాష్ట్ర కిసాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డిలు విజ్ఞప్తి చేశారు. రైతులు బయటకు వస్తే లాక్‌డౌన్‌ కారణంగా వెనక్కి పంపిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే వ్యవసాయ, ఉద్యానవన శాఖలు జోక్యం చేసుకుని గుర్తింపు కార్డులిచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. రైతులు తాము పండించిన కూరగాయలను... రైతు బజార్లల్లో, కాలనీలల్లో అమ్ముకునే అవకాశం కల్పించాలని సర్కార్‌ను కోరారు.

ABOUT THE AUTHOR

...view details