తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా పరీక్షల పెంపునకు చర్యలు చేపడుతున్నాం: ప్రభుత్వం - కరోనా పరీక్షలు

మద్యం దుకాణాలు, పబ్​లు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడించింది. కరోనా పరీక్షల పెంపునకు చర్యలు చేపడుతున్నామని తెలిపింది. వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్​ను రాష్ట్రానికి చేరవేస్తున్నామని పేర్కొంది.

government-report-to-the-high-court-on-corona-conditions-in-the-telangana
కరోనా పరీక్షల పెంపునకు చర్యలు చేపడుతున్నాం: ప్రభుత్వం

By

Published : Apr 27, 2021, 1:23 PM IST

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక అందించింది. ఈనెల 1వ తేదీ నుంచి 25 వరకు 23.55 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం పేర్కొంది. 4.39 లక్షల మందికి ఆర్టీపీసీఆర్, 19.16లక్షల మందికి ర్యాపిడ్ పరీక్షలు చేశామని వెల్లడించింది. కరోనా పరీక్షల పెంపునకు చర్యలు చేపడుతున్నామని తెలిపింది.

ఈ నెల 1వ తేదీ నుంచి 25 వరకు 341 మంది కరోనాతో మృతి చెందారని నివేదికలో పేర్కొంది. కరోనా పాజిటివ్ రేటు 3.5 శాతంగా ఉందన్న ప్రభుత్వం... నిపుణుల కమిటీ సమావేశాలు ఆన్​లైన్​లో జరుగుతున్నాయని తెలిపింది. మద్యం దుకాణాలు, పబ్‌లు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని... అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారని వెల్లడించింది.

రాష్ట్రానికి 430 టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం కేటాయించిందని... వివిధ ప్రాంతాల నుంచి ఆక్సిజన్​ను చేరవేస్తున్నామని పేర్కొంది. రెమ్‌డెసివిర్ పర్యవేక్షణ నోడల్‌ అధికారిగా ప్రీతిమీనా బాధ్యతలు తీసుకున్నట్లు ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది.

ఇదీ చూడండి: 'మల్లెపువ్వు వాసన, మామిడి పండు రుచి తెలిస్తే చాలు.. కరోనా లేనట్టే'

ABOUT THE AUTHOR

...view details