తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉచిత బియ్యం.. ప్రతి ఒక్కరికి 15 కిలోలు - మంత్రి గంగుల కమలాకర్‌ తాజా వార్తలు

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ దృష్ట్యా ఇబ్బందులు పడుతోన్న పేదలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. జూన్‌, జులై నెలలకు కలిపి ఒక్కొక్కరికి 15 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించేందుకు సిద్ధమైంది.

ఉచిత బియ్యం పంపిణీకి సిద్ధమైన సర్కార్
ఉచిత బియ్యం పంపిణీకి సిద్ధమైన సర్కార్

By

Published : May 31, 2021, 10:42 PM IST

Updated : Jun 1, 2021, 11:29 AM IST

క‌రోనా సంక్షోభంలో పేద‌ల క‌డుపు నింపేందుకు సర్కారు సిద్ధమైంది. పేదల ఆకలి తీర్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జూన్, జులై నెలలకు కలిపి ప్రతి ఒక్కరికి 15 కిలోల ఉచిత బియ్యం అందించనుంది. లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున పేదలకు ఉపాధి దొరికే పరిస్థితులు లేకపోవడంతో ప్రతి నెలా అందించే బియ్యానికి 15 కిలోలు అద‌నంగా ఇవ్వనుంది. ఇందులో జూన్ నెలలో 10 కిలోలు ఉచితంగా ఇచ్చి.. మిగతా 5 కిలోలు జులైలో ఇవ్వనుంది.

జూన్‌లో అందించే రేష‌న్‌లో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 53 లక్షల 56 వేల కార్డులకు అందించే 15 కిలోలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం 33 లక్షల 86 వేల కార్డుదారులకు 15 కిలోలు ఎలాంటి పరిమితులు లేకుండా ఉచితంగా అందించాల‌ని నిర్ణయించింద‌ని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. రేషన్‌ కార్డులో ఎంత మంది పేర్లు ఉంటే ఆ కుటుంబ సభ్యులందరికీ 15 కిలోల చొప్పున, కేంద్రం ప‌రిధిలోకి రాని ల‌బ్ధిదారుల‌కు సైతం ఈ ప్రయోజ‌నం చేకూరుతుందని తెలిపారు.

అంత్యోద‌య అన్న యోజ‌న కార్డుదారుల‌కు 35 కేజీల‌కు అదనంగా మ‌రో 10 కిలోలు, అన్నపూర్ణ కార్డుదారుల‌కు 10 కిలోల‌కు అద‌నంగా మ‌రో 10 కిలోలు ప్రభుత్వం ఉచితంగా అందించ‌నుంది. ఈ మేర‌కు ప్రభుత్వం ఉత్తర్వుల్ని జారీ చేసింది.

ఇదీ చూడండి: LOCK DOWN: రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు

Last Updated : Jun 1, 2021, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details