Ap Government: కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం..! - ఏపీలో కరోనా వార్తలు
![Ap Government: కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం..! compensation to covid dead](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13459592-351-13459592-1635226768033.jpg)
10:04 October 26
కొవిడ్ మృతులకు పరిహారం
కొవిడ్ మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 50వేల రూపాయల పరిహారం అందించనుంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పరహారం చెల్లింపు కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నారు. మృతుల జాబితా రూపొందించి చెల్లింపులు చేయాలని అధికారులకు సూచనలు జారీ చేశారు.
జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ కేటాయించనున్నారు. దరఖాస్తు తీసుకున్న 2 వారాల్లోగా పరిహారం సొమ్మును కుటుంబ సభ్యులకు అందజేయనున్నారు. దరఖాస్తు కోసం వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రొఫార్మా రూపొందించింది.
ఇదీ చదవండి:Covid cases in India: దేశంలో కొత్తగా 12,428 కరోనా కేసులు