బాణసంచాపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
10:18 November 13
బాణసంచాపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం బాణసంచాపై నిషేధం విధించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. టపాసులు విక్రయం, వినియోగించొద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎక్కడ కూడా దుకాణాల్లో, ఇతర చోట్ల బాణసంచా విక్రయించకుండా చూడాలని డీజీపీ, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్‌తోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు బాణసంచా కాల్చొద్దని ప్రభుత్వం కోరింది. బాణసంచా విక్రయ, వినియోగం విషయంలో తీసుకున్న చర్యల వివరాలను ఈనెల 16న ప్రభుత్వానికి అందించాలని సోమేశ్‌కుమార్ ఆదేశించారు.
ఇదీ చూడండి :జీహెచ్‌ఎంసీ ముసాయిదా పద్దు@ రూ.5,600 కోట్లు