ఇక నుంచి ఏపీలో అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, కమిషనరేట్లు, కలెక్టరేట్లు, ప్రభుత్వ విద్యా సంస్థలు లేపాక్షి నంది బ్రాండ్‌కు చెందిన పేపరు ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్‌కు చెందిన లేపాక్షినంది బ్రాండ్ నోట్ పుస్తకాలు, జిరాక్సుల కోసం కాపియర్ పేపర్లు, కార్యాలయాల్లో స్క్రిబ్లింగ్ ప్యాండ్‌లను మాత్రమే కొనుగోలు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
'లేపాక్షి నంది బ్రాండ్‌కు చెందిన పేపరు ఉత్పత్తులు మాత్రమే వాడాలి' - AP Government latest news
ఏపీలో అన్ని ప్రభుత్వ శాఖలు లేపాక్షి నంది బ్రాండ్‌కు చెందిన పేపరు ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఐఐఎం బెంగళూరు చేసిన సిఫార్సుల మేరకు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ కార్యాచరణ చేపట్టినట్టు ప్రభుత్వం పేర్కొంది.
ఐఐఎం బెంగళూరు చేసిన సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించేందుకు ఈ కార్యాచరణ చేపట్టినట్టు ప్రభుత్వం పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్యం, స్థానిక పరిశ్రమల ప్రోత్సాహం, కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు, గోదాముల నిర్మాణం, కాగిత ఉత్పత్తుల తయారీ, లేపాక్షినంది బ్రాండ్ నోటు పుస్తకాలు తదితర ఉత్పత్తుల తయారీ కోసం.. ఏపీ స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్‌కు బదులుగా ఏపీ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ పనిచేయనుంది.
ఇదీ చదవండి:అమానుషం: బాలికపై పైశాచికం.. హత్యాచారయత్నం