తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్కారు కీలక నిర్ణయం.. వైద్యులపై త్వరలోనే ఉత్తర్వులు! - ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం

ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న వైద్యులకు ప్రైవేటు ప్రాక్టీసుకు(Restricted doctors private practice) వీల్లేకుండా ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కానున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్​లు.. ఇలా వేర్వేరు చోట్ల పని చేస్తున్న వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం విధించనున్నారు. మరోవైపు వైద్యారోగ్యశాఖలో 14,037 వైద్యులు, నర్సింగ్, ఫార్మాసిస్టు​, తదితర సిబ్బంది నియామకానికి సెప్టెంబర్ 27న నోటిఫికేషన్ జారీ కానుంది.

Restricted doctors private practice
Restricted doctors private practice

By

Published : Sep 25, 2021, 11:57 AM IST

ఆంధ్రప్రదేశ్​లో ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై ప్రభుత్వం నిషేధం(government on doctors private practice in ap) విధించనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ కానున్నాయి. ప్రభుత్వం కొత్తగా చేపట్టనున్న రిక్రూట్​మెంట్ ప్రక్రియలో ఈ నిబంధన విధించనుంది. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్​లు.. ఇలా వేర్వేరుచోట్ల పని చేసే ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేసేందుకు వీల్లేకుండా ఉత్తర్వులు జారీ కానున్నాయి. గతంలో ప్రభుత్వంలో నియమితులైన వైద్యులకూ ప్రైవేటు ప్రాక్టీసు నిషేధిస్తూ(Restricted doctors private practice).. ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

14,037 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​..

మరోవైపు కొత్తగా 14,037 మంది వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఫార్మాసిస్టు పోస్టుల నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 3,194 మంది నర్సింగ్ పోస్టులు భర్తీ చేయాలని భావిస్తోంది. కొత్త నియామక ప్రక్రియను సెప్టెంబర్ 28న ప్రారంభించాలని(notification for requirement of doctors in ap ) నిర్ణయించారు. 85 రోజుల్లోగా ఈ నియామక ప్రక్రియను పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. కొత్తగా నియమించనున్న వైద్యులు, సిబ్బంది కోసం ఏటా రూ. 676 కోట్లు వ్యయం అవుతుందని ప్రభుత్వ అంచనా వేస్తోంది. మొత్తంగా వైద్య సిబ్బందికి రూ. 2,753 కోట్ల మేర జీతాలకు వెచ్చిస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

ఇదీ చదవండి:Tirumala Tickets : ఆన్​లైన్​లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు.. అరగంటలోనే ఖాళీ

ABOUT THE AUTHOR

...view details