కూరగాయాలు, పండ్లు, ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల అంతరాష్ట్ర సరఫరా నిమిత్తం భారత ప్రభుత్వం అగ్రిట్రాన్స్పోర్ట్ కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసింది. అంతరాష్ట్ర సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న డ్రైవర్లు, వ్యాపారులు, రిటైలర్లు తదితరులు ఈ కాల్‌సెంటర్‌ను సంప్రదించి సహాయం పొందవచ్చని భారత ప్రభుత్వ వ్యవసాయ విభాగం తెలిపింది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను సంప్రదించి సమస్య పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు ప్రకటించింది.
అంతరాష్ట్ర రవాణా కోసం అగ్రిట్రాన్స్పోర్ట్ కాల్‌సెంటర్ ఏర్పాటు - agri transport call center for internal state transport
లాక్డౌన్ కాలంలో ప్రజలు నిత్యావసర సరకుల కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం అగ్రిట్రాన్స్పోర్ట్ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. అంతరాష్ట్ర సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న డ్రైవర్లు, వ్యాపారులు, రిటైలర్లు ఈ కాల్‌సెంటర్ సేవలు వినియోగించుకోవచ్చని వెల్లడించింది.
![అంతరాష్ట్ర రవాణా కోసం అగ్రిట్రాన్స్పోర్ట్ కాల్‌సెంటర్ ఏర్పాటు agri transport call center for internal state transport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6779856-thumbnail-3x2-transport-rk.jpg)
అంతరాష్ట్ర రవాణా కోసం అగ్రిట్రాన్స్పోర్ట్ కాల్‌సెంటర్ ఏర్పాటు