తెలంగాణ

telangana

ETV Bharat / state

సంగీత, నృత్య ప్రియులకు శుభవార్త.. - ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల నోటిఫికేషన్​

మీకు సంగీతం, నృత్యం పట్ల ఆసక్తి ఉందా... అయితే ఈ నోటిఫికేషన్​ మీకోసమే. రాష్ట్రంలోని ఆరు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, పాఠశాలల్లో 2020-21 విద్యాసంవత్సరానికి గానూ వివిధ డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్​ను ప్రభుత్వం విడుదల చేసింది.

Government Music and Dance Colleges Notification release
సంగీత, నృత్య ప్రియులకు శుభవార్త..

By

Published : Nov 7, 2020, 9:50 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని 6 ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి వివిధ సర్టిఫికెట్‌ డిప్లోమా కోర్సులకు గాను నోటిఫికేషన్‌ విడుదలయింది. వీణ, హిందూస్థానీ వోకల్‌, కర్ణాటిక్‌ వోకల్‌, కర్ణాటిక్‌ వయోలిన్‌, పేరిణి నృత్యం, భరతనాట్యం, కూచిపూడి నృత్యం, కథక్‌, సితార, మృదంగం, నాదస్వరం, డోలు, తబలా, ప్లూట్‌ వంటి కోర్సులు అందించనున్నట్లు సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు.

శాస్త్రీయ సంగీతం, నృత్యం పట్ల ఆసక్తి ఉండి 10 సంవత్సరాలు నిండినవారు ఆడ్మిషన్లు పొందవచ్చు అని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఆయా కళాశాల ప్రిన్సిపాల్‌ సంప్రదించాలని కోరారు. ప్రస్తుతం కొవిడ్‌ -19 వ్యాప్తి దృష్ట్యా ఈకోర్సులన్నింటిని ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రవేశాల కోసం అసక్తి గల అభ్యర్థులు ఆయా కళాశాల సంబంధిత కళాశాల వైబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు ఫారంను పొందవచ్చునని. పూర్తి చేసిన దరఖాస్తులు ఆన్‌లైన్‌లో సమర్పించాలన్నారు.

1. హైదరాబాద్‌ రామకోఠిలోని శ్రీత్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల

వైబ్‌సైట్‌ www.stgcmd.com

కళాశాల ప్రిన్సిపల్‌ ‌ ఫోన్‌ నెంబర్‌ 90005444874,

ఆఫీస్‌ ఫోన్‌ నెంబర్‌ 040-24758090.

2. శ్రీ భక్త రామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల సికింద్రాబాద్‌,

ప్రిన్సిపల్‌ కె. వరలక్ష్మమ్మ, ఫోన్‌. 9849166973

ఆఫీస్‌ నెంబర్‌ 0404-27801788

వైబ్‌సైట్ www.sbrgcmd.com

3. అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల గుడిమాల్కాపూర్‌, ఓల్డ్‌సిటీ హైదరాబాద్‌

ప్రిన్సిపల్‌ ‌ ఎస్‌. రమణమూర్తి, ఫోన్‌ నెంబంర్‌: 9703240329

ఆఫీస్‌ ఫోన్‌-040- 23523850

వైబ్‌సైట్ www.sancgcmd.com

4. విద్యారణ్య ప్రభుత్వ సంగీత కళాశాల; వరంగల్‌.

ప్రిన్సిపల్‌ పద్మజా ఫోన్‌ 9849796546

ఆఫీస్‌ నెంబర్‌ 0870- 4226228

వైబ్‌సైట్ www.srividyaranya.com

5. శ్రీజ్ఞాన సరస్వతి ప్రభుత్వ సంగీత నృత్య పాఠశాల నిజామాబాద్‌

ప్రిన్సిపల్‌ సరిత...ఫోన్‌ 9704687023

వైబ్‌సైట్ www.sgsgsmdnzb.org

6. ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల... మంథని, కరీంనగర్

‌ ప్రిన్సిపల్‌ పాండురంగారావు ముతాలిక్‌, ఫోన్‌ 8008006767

ఆఫీస్‌ నెంబర్‌ 08729-279090

ఇదీ చూడండి:వ్యవసాయ డిప్లొమా కోర్సులకు రెండో విడత కౌన్సెలింగ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details