వర్షాలు, వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటున్నారు. అన్ని జిల్లాల్లోనూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అన్ని శాఖల అధికారులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేకించి లోతట్టు ప్రాంతాలు, ముంపునకు అవకాశం ఉన్న చోట మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వర్షాలు, వరదలతో మరింత అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుతం - భారీ వర్షాలు
వర్షాలు, వరదలతో రాష్ట్రప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్... అన్ని జిల్లాల్లోనూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అధికారులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వర్షాలు, వరదలతో మరింత అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుతం
చాలా చోట్ల చెరువులు, కుంటలు నిండి పొర్లుతున్న నేపథ్యంలో అవసరమైన మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులకు స్పష్టం చేశారు. నదీ తీర ప్రాంతాల్లో యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏటూరునాగారం ప్రాంతంలో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలోని 12 ఆవాసాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోన్న గోదావరి