కొవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నందున ప్రైవేటు వైద్య కళాశాలల్లోను కొవిడ్ సేవలు అందించేందుకు సర్కారు కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు శనివారం అన్ని ప్రైవేటు వైద్య కాలేజీ యాజమాన్యాలతో మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కానున్నారు.
ప్రైవేటు వైద్యకళాశాలల్లోను కొవిడ్ సేవలు!
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రైవేట్ వైద్య కళాశాలల్లోను పూర్తి స్థాయిలో కొవిడ్ సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మంత్రి ఈటల... శనివారం అన్ని ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యతో చర్చించనున్నారు.
eetela, covid
కోఠిలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కళాశాలల ప్రతినిధులతో చర్చించిన అనంతరం... ప్రైవేట్ సూపర్ స్పెషలిటీ ఆస్పత్రులు, ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అధిపతులతోనూ సమావేశం కానున్నారు. కరోనా రోగులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే సరైన చికిత్సలు అందించడం సహా... పడకల కేటాయింపుపై చర్చించనున్నారు.
ఇదీ చూడండి:ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: టీఎస్‌యూటీఎఫ్