హైదరాబాద్ కేపీహెచ్‌బీ ప్రాంతంలో 4వ ఫేజ్‌లో 6 ఎకరాలు, మలేసియా టౌన్‌షిప్ ఎదురుగా 27 ఎకరాల భూమిని వేలం వేయనుంది (lands sale Notification in KPHB). 4 ఎకరాలు వసతుల కల్పనకు పోగా 29 ఎకరాల్ని ఈ-వేలం ద్వారా విక్రయించనున్నారు. ఇప్పటికే వేలం బాధ్యతలను ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు అప్పగించింది. హౌసింగ్ బోర్డు భూములతో పాటు ‘స్వగృహ’ కార్పొరేషన్ ఫ్లాట్లనూ అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది (government lands sale Notification in KPHB). ఇక జీహెచ్‌ఎంసీ (ghmc lands) నుంచి లేఅవుట్ అనుమతులు రావడమే ఆలస్యం. మాల్స్, వాణిజ్య సంస్థలకు కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో గజానికి రూ.లక్ష దాకా పలకొచ్చని అంచనా. ఇక్కడ ఎకరం రూ.50 కోట్లకు అమ్ముడవుతుండగా ఈ 29 ఎకరాలతో దాదాపు రూ.1,450 కోట్ల దాకా నిధులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కేపీహెచ్‌బీ అయిదో ఫేజ్‌లో 130 గజాల స్థలాన్ని హౌసింగ్ బోర్డు శనివారం వేలం వేసింది. గజానికి రూ.70 వేలు నిర్ణయించగా 20 మంది బిడ్డర్లు పాల్గొన్నా ధర ఎక్కువ ఉందని కొనకుండా వెనక్కి వెళ్లిపోయారు.
మరో 123 ఎకరాలు...
హౌసింగ్ బోర్డుకు కూకట్‌పల్లి (kukatpally), శేరిలింగంపల్లి, ఘట్‌కేసర్, కుత్బుల్లాపూర్ మండలాల పరిధిలోనూ విలువైన భూములున్నాయి. తర్వాతి దశల్లో వీటిని వేలం వేసేందుకు కసరత్తు జరుగుతోంది. కూకట్‌పల్లి మండల పరిధిలో కైతలాపూర్‌లో 11 చోట్ల, గ్రామ పరిధిలో 2 చోట్ల, గచ్చిబౌలి, చింతల్‌లో ఒక్కోచోట, ఘట్‌కేసర్ మండలం పోచారంలో 9 చోట్ల భూముల్ని గుర్తించారు. మొత్తం 123.12 ఎకరాలుండగా దాదాపు 38 ఎకరాలకు సంబంధించి వివాదాలున్నాయని, అవితొలగాక వేలానికి సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది.