భైంసాలో అల్లర్లు జరిగి 20 కుటుంబాలు గూడు కోల్పోతే ప్రభుత్వం సరిగా ఆదుకోలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఐడీపీఎల్ల్లో నిర్వహించిన శివాజీ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
'భైంసా బాధితులను ప్రభుత్వం సరిగా ఆదుకోలేదు' - హైదరాబాద్ నేటి వార్తలు
భైంసా ఘటనలో 20 కుటుంబాలు తమ ఇళ్లను కోల్పోతే.. ప్రభుత్వం సరియైన సహాయక చర్యలు తీసుకోలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హైదరాబాద్ ఐడీపీఎల్ల్లో నిర్వహించిన శివాజీ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు.
'ప్రభుత్వం సరిగా ఆదుకోలేదు'
భైంసా ఘటనపై అక్కడి జిల్లా కలెక్టర్‌ను వారికి ఏ సహాయం చేశారని అడిగితే బియ్యం ఇచ్చారని చెప్పారని అన్నారు. దేశవ్యాప్తంగా సీఏఏపై కేవలం దిల్లీలోని షాహీన్‌బాగ్ కాలనీలో తప్ప మరెక్కడా అల్లర్లు లేవని ఎంపీ తెలిపారు.
ఇదీ చూడండి :'ఎన్నికల్లో డబ్బులు తీసుకొని తప్పు చేశారు'