తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్​కు తరలకుండా పక్కా ప్రణాళికతో ప్రభుత్వం - ఆక్సిజన్ సరఫరా

కరోనా కేసుల ఉద్ధృతి పెరుగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్​కు తరలకుండా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేసే డీలర్లపై నిఘా పెంచింది. ఆరు ప్రభుత్వ శాఖలతో వంద ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది.

government-is-moving-ahead-with-a-definite-plan-in-oxygen-supply
ఆక్సిజన్ సరఫరాలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్న సర్కార్

By

Published : May 19, 2021, 11:05 AM IST

రాష్ట్రంలో ఆక్సిజన్ బ్లాక్ మార్కెట్​కు తరలకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్రమార్కుల ఆటకట్టించి... ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు రెవెన్యూ, వాణిజ్య పన్నులు, డ్రగ్స్, రవాణా, పోలీసు, ఆబ్కారీ శాఖలను భాగస్వామ్యం చేస్తూ... ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది.

రెవెన్యూ శాఖ ప్రాణవాయువు నిల్వ, సరఫరాల వివరాలు సేకరిస్తుంది. డ్రగ్స్ విభాగానికి చెందిన వారు ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాతో పాటు వాడకం వివరాలు తెలుసుకుంటారు. గొడవల నియంత్రణకు పోలీస్ శాఖ, బయటి నుంచి వచ్చే ఆక్సిజన్ క్రమ పద్ధతిలో సరఫరా జరిగేలా ఆబ్కారీ శాఖ పర్యవేక్షించనుంది. ఇలా ఆయా శాఖలకు చెందిన అధికార బృందాలు ఆక్సిజన్ సరఫరా, వాడకంపై నిఘా ఏర్పాటు చేసింది. వీటితో అక్రమార్కులకు అడ్డుకట్ట వేయవచ్చని సర్కార్ భావిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం మరో 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించనున్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:కొవిడ్ ప్రభావం- ఆహార వ్యవస్థలు అతలాకుతలం

ABOUT THE AUTHOR

...view details