తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించి కార్మికుల చావులకు కారణమవుతోందని శివసేన, సీపీఎం నేతలు ఆరోపించారు. కార్మికుల చావులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కాచిగూడ బస్ డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఒకరోజు రిలే నిరాహార దీక్షకు మద్దతుగా సీపీఎం, శివసేన పార్టీల నేతలు దీక్షలో పాల్గొన్నారు. డిపో ముందు అమరులైన కార్మికులకు నివాళులు అర్పిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇంత మంది కార్మికులు మరణిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని నేతలు డిమాండ్ చేశారు.
'ఆర్టీసీ కార్మికుల పట్ల క్షక్షపూరితంగా వ్యవహరించడం సరికాదు' - కాచిగూడ
ఇవాళ కాచిగూడ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ఒకరోజు రిలే నిరాహార దీక్షకు శివసేన, సీపీఎం పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి.
'ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వం క్షక్షపూరితంగా వ్యవహరిస్తోంది'