దేవాదాయ శాఖకు సంబంధించిన కోట్ల స్థలాన్ని భూ కబ్జాదారులు అక్రమంగా కబ్జా చేస్తుంటే దేవాదాయ శాఖ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. చెరువులు, కుంటలతో పాటు దేవాదాయ స్థలాలు కబ్జాకు గురవుతున్నా... ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
'దేవాలయ భూములపై గుడ్డిగా సర్కారు వ్యవహరిస్తోంది' - Chada on Cm kcr
దేవాదాయ శాఖకు సంబంధించిన కోట్ల స్థలాన్ని అక్రమంగా కబ్జా చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.
లలితాబాగ్ కాళికా మాత గుడి స్థలాలను కాపాడింది సీపీఐ అని, ఆ స్థలం రక్షణకు ఎంతకైనా తెగిస్తామని తెలిపారు. మరో రెండు రోజుల్లో దేవాదాయ శాఖ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకునే వరకు ప్రయత్నించిన భూ కబ్జాదారులపై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు.
వివాదాస్పదంగా మారుతున్న ఉప్పుగూడ కాళికా మాతా దేవాలయానికి సంబంధించిన 24, 25, 26 సర్వే నెంబర్లలోని 7ఎకరాల 30 గుంటల స్థలాన్ని చాడ వెంకట్ రెడ్డి, హైదరాబాద్ కార్యదర్శి ఈటీ నరసింహ నాయకుల బృందం సందర్శించింది.