ఆంధ్రప్రదేశ్లో నగదు లావాదేవీలు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగుల వద్ద గతంలో రూ.500గా ఉన్న వ్యక్తిగత నగదు పరిమితిని రూ.1,000కి పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొబైల్ ఫోన్లలో వివిధ డిజిటల్ యాప్‌లు అందుబాటులో ఉన్నందున నగదు లావాదేవీలు నిర్వహించే ఉద్యోగులు ఎక్కువ మొత్తంలో నగదు ఉంచుకోవడం లేదని పేర్కొంది. ఈ లావాదేవీలు నిర్వహించే విభాగాల ఉద్యోగులు, రెవెన్యూ వసూళ్లు చేసేవారు విధులకు హాజరయ్యే సమయంలో రూ.1,000 కంటే ఎక్కువ నగదు ఉంటే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది. ఏసీబీ ఇచ్చిన సిఫార్సుల మేరకు దీనిని పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది.
'ప్రభుత్వ ఉద్యోగుల జేబుల్లో రూ.1,000 మాత్రమే ఉండాలి'
నగదు లావాదేవీలు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగుల వద్ద వ్యక్తిగత నగదు పరిమితిని రూ.1000కి పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న రూ.500 పరిమితిని రూ.1000కి పెంచుతున్నట్టుగా సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగుల జేబుల్లో రూ. 1000 మాత్రమే ఉండాలి