తెలంగాణ

telangana

ETV Bharat / state

'పౌల్ట్రీ, మత్స్య రంగాలకు అవసరమైన సాయమందిస్తాం' - పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకుంటామన్న తలసాని

వ్యవసాయ అనుబంధ పౌల్ట్రీ, మత్స్య, మాంసం పరిశ్రమ రంగాలకు అవసరమైన సాయం అందించేందుకు సర్కారు ముందుకొచ్చింది. గొర్రె, కోడి మాంసం, గుడ్లు, చేపల ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకొచ్చి వినియోగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

'Government helps Poultry and fisheries' says minister thalasani
'పౌల్ట్రీ, మత్స్య రంగాలకు అవసరమైన సాయమందిస్తాం'

By

Published : Mar 30, 2020, 5:07 PM IST

రాష్ట్రంలో గొర్రె, కోడి మాంసం, గుడ్లు, చేపల ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకొచ్చి వినియోగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ అనుబంధ పౌల్ట్రీ, మత్స్య, మాంసం పరిశ్రమ రంగాలకు అవసరమైన సాయం అందించేందుకు సర్కారు ముందుకొచ్చింది. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్​ పశు సంక్షేమ భవన్‌లో పశు సంవర్థక, మత్స్య శాఖల ఉన్నతాధికారులు, పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమల ప్రతినిధులతో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సమీక్షించారు. పరిమాణం వచ్చిన చేపలు పట్టుకుని విక్రయించుకునేలా మత్స్యకారులకు అనుమతులు ఇవ్వనున్నామంటున్న మంత్రి శ్రీనివాసయాదవ్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి మల్లిక్ ముఖాముఖి..

'పౌల్ట్రీ, మత్స్య రంగాలకు అవసరమైన సాయమందిస్తాం'

ABOUT THE AUTHOR

...view details