తెలంగాణ

telangana

ETV Bharat / state

FUNDS: ముఖ్యమంత్రి హామీల అమలుకు నిధులు మంజూరు - telangana varthalu

సీఎం కేసీఆర్​ హామీల అమలుకు నిధులు మంజూరయ్యాయి. ఇటీవల సిద్దిపేట, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల పర్యటనల సందర్భంగా సీఎం కేసీఆర్​ హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

FUNDS: ముఖ్యమంత్రి హామీల అమలుకు నిధులు మంజూరు
FUNDS: ముఖ్యమంత్రి హామీల అమలుకు నిధులు మంజూరు

By

Published : Jul 8, 2021, 3:31 PM IST

ముఖ్యమంత్రి హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇటీవల సిద్దిపేట, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల పర్యటనల సందర్భంగా సీఎం నిధులు మంజూరు చేస్తూ హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి నుంచి నిధులు మంజూరు చేశారు. కామారెడ్డి పురపాలికకు 50 కోట్లు, బాన్స్​వాడ, ఎల్లారెడ్డి పురపాలికలకు 25 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి.

కామారెడ్డి జిల్లాలోని 526 గ్రామపంచాయతీలకు పది లక్షల చొప్పున నిధులు... మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకి మండలంలో అభివృద్ధి పనుల కోసం 20 కోట్ల నిధులను ఇవ్వనున్నారు. భువనగిరి పురపాలికకు కోటి రూపాయలు, మోత్కూరు, పోచంపల్లి, ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ పురపాలికలకు 50 లక్షల చొప్పున నిధులు రానున్నాయి. యాదాద్రి జిల్లాలోని 421 గ్రామపంచాయతీలకు 25 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. 281.35 కోట్ల రూపాయలకు పరిపాలనా అనుమతులు ఇస్తూ ప్రణాళికా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి: KTR TWEET: పల్లె ప్రకృతి వనాల ఫొటోలను ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details