తెలంగాణ

telangana

ETV Bharat / state

Irrigation Plantation: నీటిపారుదలశాఖ భూముల్లో భారీ ఎత్తున మొక్కలు

సాగునీటిశాఖ కింద ఉన్న భూముల్లో భారీ ఎత్తున మొక్కలు (Irrigation Plantation) నాటేలా ప్రభుత్వం కార్యచరణ సిద్ధం చేస్తోంది. ఇందుకు అనుగూణంగా 12 లక్షల ఎకరాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని భావిస్తోంది.

Irrigation Plantation
Irrigation Plantation

By

Published : Nov 28, 2021, 6:21 AM IST

Irrigation Plantation: నీటిపారుదలశాఖకు చెందిన భూముల్లో భారీ ఎత్తున మొక్కలు నాటేలా త్వరలో కార్యాచరణ అమలు కానుంది. వివిధ ప్రాజెక్టులు, జలాశయాలు, కాల్వలు, ఇతరత్రాల కింద సాగునీటిశాఖకు 12 లక్షల ఎకరాలకు పైగా భూమి ఉంది. వాటిలో పెద్దఎత్తున మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) ఆదేశించారు. అందుకు అనుగుణంగా పది కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

వివిధ రకాల భూములను దృష్టిలో ఉంచుకొని వాటికి అనుగుణంగా నాటాల్సిన మొక్కలు, అనుసరించాల్సిన పద్ధతుల ఆధారంగా ప్రణాళిక రూపొందించారు. సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి నేతృత్వంలో ఇందుకోసం ఓ ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. మొక్కలు నాటే అంశంపై ఈఎన్సీలు మురళీధర్, అనిల్, సీఈ శంకర్ తదితరులతో నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్ కుమార్ సమీక్ష నిర్వహించారు. భారీసంఖ్యలో మొక్కలు నాటేందుకు సిద్ధం చేసిన ప్రణాళికను ముఖ్యమంత్రికి నివేదించి ఆమోదం అనంతరం కార్యాచరణ ప్రారంభించనున్నారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details