రాష్ట్రంలో విద్యాసంస్థల పున:ప్రారంభం (Schools Reopening)పై ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indrareddy), పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ (Cm Kcr) సమీక్ష నిర్వహిస్తున్నారు. సమీక్షకు విద్య, వైద్య, పంచాయతీరాజ్ అధికారులు హాజరయ్యారు. ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Schools Reopening: విద్యాసంస్థల పున:ప్రారంభంపై కాసేపట్లో స్పష్టత..! - Cm kcr review news
15:29 August 23
అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం
ఏపీలో ప్రారంభం...
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. ఒకటి నుంచి 10వ తరగతి, ఇంటర్ రెండో ఏడాది తరగతులు ప్రారంభమయ్యాయి. గదుల కొరత ఉన్న విద్యా సంస్థల్లో రెండు విడతలుగా తరగతులు నిర్వహించనున్నారు. అన్ని పాఠశాలల్లో కరోనా నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాలల్లో మాస్కు, భౌతికదూరం, థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి చేసింది.
ఇదీచూడండి:హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ.500 కోట్ల నిధులు