తెలంగాణ

telangana

ETV Bharat / state

DOG BREEDING: రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే... అమ్మలేరు! - STATE ANIMAL WELFARE BOARD LATEST NEWS

పెంపుడు జంతువులను కొనాలనుకుంటున్నారా.. ఇకనుంచి ఎక్కడ పడితే అక్కడ కొనడానికి వీలులేదు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. వారి నుంచి మాత్రమే క్రయ విక్రయాలకు అనుమతిస్తూ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది. 4 వారాల్లోగా విక్రయదారులు అంతా తమ పేర్లను రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే వారిపై చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ నిర్ణయించింది.

government-focus-on-dogs-breeding-and-marketing
డాగ్ బ్రీడర్స్​ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: అర్వింద్ కుమార్

By

Published : Jul 4, 2021, 10:25 AM IST

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెంపుడు జంతువులపై క్రూరత్వాన్ని అరిట్టాలని, కుక్కల పెంపకం దారులు, అమ్మకం దారుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్​ కుమార్ అధికారులను ఆదేశించారు. జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం‌‌–2018 నిబంధనలకు లోబడి డాగ్ బ్రీడర్స్ కార్యకలాపాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్​లకు లేఖలు రాశారు. డాగ్​ బ్రీడింగ్​ ఆక్టివిటీ చేసే వారందరు స్టేట్​ ఎనిమల్​ వెల్ఫేర్​ బోర్డులో రిజిస్ట్రేషన్​ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నాలుగు వారాల పాటు గడువు కల్పించి రిజిస్ట్రేషన్​కు సహకరించాలని అర్వింద్ కుమార్ సూచించారు.

సామాజిక మాధ్యమాల ​ద్వారా అధికారిక, అనధికారిక ప్రకటనలతో కుక్క పిల్లల క్రయవిక్రయాలు జరపడం అక్రమమని అర్వింద్​ కుమార్ స్పష్టం చేశారు. ఆన్​లైన్ ​ద్వారా కుక్క పిల్లల క్రయ విక్రయాలకు తెలంగాణ స్టేట్ ఎనిమల్​ వెల్ఫేర్ బోర్డు రిజిస్ట్రేషన్ తప్పనిసరని ఆయన తెలిపారు. ఆన్​లైన్​లో జరిగే ఇలాంటి లావాదేవీలు, వ్యాపారాలపై ఐటీ శాఖ నిఘా వేసి కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్​కు సూచించారు.

నిబంధనలు పాటించని వారి కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేశారు. పశుసంవర్ధక, మున్సిపల్, పోలీసు శాఖల సహకారంతో రిజిస్ట్రేషన్​ లేని డాగ్​ బ్రీడర్సపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఈ అంశంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను ఆగస్టు 15వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదించాలని కోరారు.

ఇదీ చూడండి:Underground parking : రాష్ట్రంలో భూగర్భ పార్కింగ్ నిషేధం..!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details