Employees Allotments: ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ ఒకట్రెండు రోజుల్లో పూర్తి కానుంది. జిల్లా స్థాయి ఉద్యోగులకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయ్యింది. జోనల్, బహుళ జోన్లకు సంబంధించిన ఉద్యోగుల కసరత్తు తుదిదశకు చేరుకుంది. భార్యాభర్తలకు సంబంధించిన స్పౌస్ కేసులతో పాటు అప్పీళ్ల పరిష్కార ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలిస్తున్నారు. వాటిని ఏ మేరకు పరిగణలోకి తీసుకోవచ్చన్న విషయమై అధికారులు దృష్టి సారించారు. స్పౌస్ కేసులతో పాటు అప్పీళ్ల పరిష్కారంపై ఉన్నతాధికారులతో సమీక్షించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వారికి దిశానిర్దేశం చేశారు. నిబంధనలకు లోబడి వాటన్నింటిని పరిష్కరించాలని స్పష్టం చేశారు.
ఒకట్రెండు రోజుల్లో ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ పూర్తి
Employees Allotments: ఉద్యోగుల స్పౌస్ కేసులు సహా అప్పీళ్ల పరిష్కార ప్రక్రియ కొనసాగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో కసరత్తు పూర్తయ్యే అవకాశం ఉంది. అటు పరస్పర బదిలీలకు అనుమతి ఇచ్చే దిశగా కసరత్తు జరుగుతోంది.
ఒకట్రెండు రోజుల్లో ఉద్యోగుల విభజన, కేటాయింపు ప్రక్రియ పూర్తి
అన్ని దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావచ్చని భావిస్తున్నారు. అటు పరస్పర బదిలీలకు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అక్రమాలకు, దందాలకు ఆస్కారం ఇవ్వకుండా పరస్పర బదిలీలకు అనుమతి ఇచ్చేలా విధివిధానాలు ఖరారు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం అనంతరం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: