విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు.... వారికి అర్థమయ్యేలా బోధించడం కూడా ముఖ్యమే. తరగతుల పట్ల విద్యార్థులకు ఆసక్తి కలిగించేలా హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. ఈ బడిలో మొత్తం 960 మంది విద్యార్థులున్నారు. వీరికి పాఠాల పట్ల ఆసక్తి కలిగించేలా... దృశ్యాల రూపంలో చెబుతున్నారు. డిజిటల్ విధానంలో తరగతులు చెబుతున్నారు. హోప్ స్వచ్ఛంద సంస్థ ఈ బడికి ప్రొజెక్టర్లు, డిజిటల్ సామగ్రి అందించింది.
దృశ్యరూప బోధన...
క్వేస్ట్-సెయింట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ-లెర్నింగ్ గదిని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అందించిన పోర్టబుల్ కిట్‌తో... డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశాలను... విద్యార్థులకు అర్థం అయ్యే రీతిలో బోధిస్తున్నారు. ఒకసారి చెప్పిన పాఠాలను మరోసారి డిజిటల్ ద్వారా దృశ్యరూపంలో వివరిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
డిజిటల్‌తో సులభరీతిలో..