తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే తనను గెలిపిస్తాయని శేరిలింగంపల్లి పరిధిలోని హైదర్‌నగర్ తెరాస అభ్యర్థి నార్నె శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. ఆరేళ్లుగా డివిజన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాని..స్థానిక సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి అవగాహన ఉందని తెలిపారు. ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇచ్చిందుకు కేసీఆర్, కేటీఆర్, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే గాంధీకి ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధే గెలిపిస్తుంది: నార్నె శ్రీనివాసరావు
ఆరేళ్లుగా డివిజన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నానని.. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన అందని హైదర్‌నగర్ తెరాస అభ్యర్థి నార్నె శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధే గెలిపిస్తుంది: నార్నె శ్రీనివాసరావు
డివిజన్లో చెరువులను సుందరీకరించామని.. పార్కుల అభివృద్ధి చేశామన్నారు. రాబోయే రోజుల్లో డివిజన్లో పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తానని తెలిపారు. అనునిత్యం ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఇవీచూడండి:అగ్రనేతల ప్రచారంతో వేడెక్కిన బల్దియా.. గల్లీగల్లీలో పర్యటనలు