తెలంగాణ

telangana

ETV Bharat / state

నీటి పొదుపరులకు త్వరలో అవార్డులు.. సర్కార్ నిర్ణయం - తెలంగాణ జల వనరుల అభివృద్ధి

Water Conservation Awards-2021 : నీటి సంరక్షణ కార్యక్రమాలు గుర్తించి.. ప్రోత్సాహించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. నీటిని సంరక్షించడానికి వినూత్న పద్ధతులను అనుసరించే వ్యక్తులు, వ్యవస్థలను ప్రోత్సహించాలని భావిస్తోంది. వారికి త్వరలో అవార్డులు ఇవ్వనుంది.

Water Conservation Awards-2021, water saving method
నీటి పొదుపరికి అవార్డులు.. వివరాలతో దరఖాస్తు చేస్తే సరి!

By

Published : Feb 8, 2022, 4:47 PM IST

Water Conservation Awards-2021 : స్వరాష్ట్ర సాధన తర్వాత ఏడేళ్లల్లో జరిగిన నీటి సంరక్షణ కార్యక్రమాలు గుర్తించి ప్రోత్సహించేందుకు సర్కారు సిద్ధమైంది. తెలంగాణ నీటి సంరక్షణ పురస్కారాలు-2021 ఇవ్వాలని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతి వర్షపు చుక్క ఒడిసి పట్టుకుంటూ... వృధా చేయకుండా సంరక్షిస్తున్న వారిని ప్రోత్సహించాలని భావిస్తోంది.

నీటి సంరక్షణ వినూత్న పద్ధతులు...

  • వర్షపు నీటి సంరక్షణ
  • కృత్రిమ రీఛార్జి ద్వారా భూగర్భ జలాలు పెంచడం
  • వర్షపు నీటి సంరక్షణ పెంపొందించడం
  • మురుగు లేదా కలుషిత నీటి పునర్వినియోగం
  • రీసైక్లింగ్ ట్రీట్‌మెంట్
  • చెరువులు, కాలువల పునరుద్ధరణ
Water

పై కార్యక్రమాల కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, రైతులు, సంస్థలను ప్రొత్సహించాలన్నది లక్ష్యం. క్షేత్రస్థాయిలో నీటి సంరక్షణ కోసం ప్రజలను చైతన్యవంతం చేయడం, సమీకరించే ఉద్యమాలు తదితర రంగాల్లో కృషి చేసిన సంస్థలు, వ్యక్తులు ఈ పురస్కారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

నీటి సంరక్షణ పురస్కారాల్లో...

  • ఉత్తమ ప్రభుత్వ సంస్థ
  • ఉత్తమ ప్రైవేటు సంస్థ
  • ఉత్తమ పాఠశాల
  • ఉత్తమ బహుళ అంతస్తుల భవనం
  • ఉత్తమ కాలనీలు
  • ఉత్తమ గేటెడ్ కమ్యూనిటీ
  • ఉత్తమ వ్యక్తులు
  • ఉత్తమ స్వచ్ఛంద సంస్థలు
  • ఉత్తమ నిపుణులు
  • చెరువులు-కాలువల పునరుద్ధరణ
  • ఉత్తమ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా
  • ఉత్తమ పరిశ్రమ
  • ఉత్తమ కార్పొరేట్

సామాజిక బాధ్యత - సీఆర్‌ఎస్ కింద 11 కేటగిరీల్లో ఈ పురస్కారాలు అందజేస్తారు. నీటి సంరక్షణ రంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తులు, సంస్థలు కార్యక్రమాల పూర్తి వివరాలతో ఈ నెల 15వ తేదీలోగా hyderabadwaterawards@gmail.comకు మెయిల్‌ చేయాలని రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ, హైదరాబాద్ నీటి సంరక్షణ పురస్కారాల కమిటీ ఛైర్మన్ వి.ప్రకాష్ అన్నారు. https://tswalamtari.weebly.com వెబ్‌సైట్‌ నుంచి స్వీకరించిన దరఖాస్తును రాసి పంపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:TS High court :'డబుల్' ఇళ్ల కేటాయింపులో వాళ్లకు కూడా కేటాయించండి

ABOUT THE AUTHOR

...view details