Liquor Sales in AP: దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని.. మద్యంపై వచ్చే ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తామని పలు సందర్భాల్లో చెప్పిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం.. ఇప్పుడు మందుబాబులతో మరింత ఎక్కువగా తాగించటమెలా? తద్వారా ఆదాయం ఇంకా పెంచుకోవటమెలా అనేదానిపై దృష్టిసారించింది. అమ్మకాలు ఏ సమయంలో ఎక్కువగా జరుగుతున్నాయి.. మందుబాబులు ఎలాంటి మద్యం తాగటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు? ఏ వయసువారు ఎక్కువగా కొంటున్నారు? డిమాండుకు తగ్గట్లుగా మద్యం సరఫరా అవుతోందా.. లేదా? వంటి అంశాలపై ఈ సర్వే చేయిస్తోంది.
ఏ వయసువారు ఎక్కువగా కొంటున్నారు? సరిపడా సప్లై ఉందా? మద్యంపై సర్కారు సర్వే..!
Liquor sales in AP: మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పిన ఏపీ సీఎం జగన్ ఇప్పుడు మద్యంపై ఆదాయం ఎలా పెంచాలా అని ఆలోచిస్తున్నారు. అందువల్ల ఏపీ ప్రభుత్వం మద్యం విక్రయాలపై దృష్టిసారించింది. అమ్మకాలు ఏ సమయంలో ఎక్కువగా జరుగుతున్నాయి? మందుబాబులు ఎలాంటి మద్యం తాగటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు? ఏ వయసు వారు ఎక్కువగా కొంటున్నారు? డిమాండ్‌కు తగ్గట్లుగా మద్యం సరఫరా అవుతోందా.. లేదా? వంటి అంశాలపై ఈ సర్వే నిర్వహించింది. మరి ఆ సర్వే వివరాలు చూద్దామా..
AP Govt Survey on Liquor: లోటుపాట్లు ఎక్కడున్నాయో చూసుకుని వాటికి అనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలు రూపొందించుకోవటం, అమ్మకాలు పెంచుకోవటమే ఈ సర్వే లక్ష్యంగా కనిపిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం దుకాణాల సూపర్వైజర్లకు ఓ ప్రశ్నావళిని పంపించింది. ఆన్లైన్లో సమాధానాలివ్వాలని ఆదేశించింది. ఇటీవల బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఈ ప్రశ్నావళికి సమాధానాలు పంపించాలని సూపర్వైజర్లను ఆదేశించారు. జిల్లా పేరు, మద్యం డిపో, నియోజకవర్గం, మద్యం దుకాణం లైసెన్సు సంఖ్య తదితర వివరాలను పొందుపరిచి.. ఈ సర్వేకు సూపర్వైజర్లు సమాధానాలు ఇస్తున్నారు. సర్వే నిర్వహించింది.
ఇవీ చదవండి: